Loading...
Anantapur: అనంతపురం శాస్త్రవేత్తకు డెన్మార్క్‌ నుంచి రూ.3.6 కోట్ల ఫెలోషిప్
అనంతపురం శాస్త్రవేత్తకు డెన్మార్క్‌ నుంచి రూ.3.6 కోట్ల ఫెలోషిప్

Anantapur: అనంతపురం శాస్త్రవేత్తకు డెన్మార్క్‌ నుంచి రూ.3.6 కోట్ల ఫెలోషిప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనంతపురం జిల్లాలోని రేకులకుంట ఉద్యాన పంటల పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న బాతినేని విమలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. డెన్మార్క్‌ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌కు ఆమె ఎంపికయ్యారు. ఈ ఫెలోషిప్‌లో భాగంగా డెన్మార్క్‌లోని సదరన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌లో మూడేళ్లపాటు పరిశోధనలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆమెకు మొత్తం రూ.3.6 కోట్ల ఫెలోషిప్‌ మంజూరుకానుంది. పరిశోధనలో భాగంగా డెన్మార్క్‌లో ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న సోయాకు ప్రత్యామ్నాయంగా ఫావా బీన్స్‌ సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించనున్నారు. అలాగే ఆ పంట సాగు వల్ల కలిగే పర్యావరణ, ఆర్థిక ప్రభావాలను సమగ్రంగా విశ్లేషించి అంచనా వేయనున్నారు.

ADVERTISEMENT