Page Loader
Nasscom : కర్ణాటకలో ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే బిల్లు.. రద్దు చేయాలని నాస్కామ్ డిమాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2024
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ [నాస్కామ్] కర్ణాటక బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇది ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఉద్యోగాలను రిజర్వ్ చేయడానికి ఉద్దేశించింది. పరోక్షంగా తమ వ్యాపారాలు వేరే చోటికి తరలిపోవడానికి మార్గాలను సుగమం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది . రెండు రోజుల ముందు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన పరిశ్రమల బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. 2024లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అభ్యర్థులకు ఉపాధి కల్పించాలని తీసుకున్న నిర్ణయం తమను నిరుత్సాహానికి గురి చేసిందని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ పరిశ్రమ సంఘం ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు లేఖ రాసింది.

#1

 సోషల్ మీడియా Xలో పోస్ట్ 

ఆ లేఖను సోషల్ మీడియా Xలో పోస్ట్ చేసింది. ఈ బిల్లులోని నిబంధనలపై నాస్కామ్ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపింది. బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని" అని పరిశ్రమ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.