
Andaman: భారత్ క్షిపణి పరీక్షలు.. అండమాన్ నికోబార్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు నోటమ్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
అండమాన్ నికోబార్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మే 23, 24 తేదీల్లో భారత్ అత్యాధునిక క్షిపణి పరీక్షలు నిర్వహించనుండటంతో, సంబంధిత అధికారులు ఎయిర్‌లైన్స్‌కు నోటమ్ (NOTAM - Notice to Airmen) జారీ చేశారు.
ఈ రెండు రోజుల్లో ప్రతి ఉదయం 7 గంటల నుంచి మూడు గంటల పాటు గగనతలంలో పరీక్షలు జరగనున్నందున, పౌర విమానాలకు ఈ ప్రాంతంలో ప్రవేశం లేదు.
ఈ ఆంక్షల కాలంలో ఎటువంటి సివిలియన్ విమానాలకూ గగనతలంలో చక్కర్లు కొట్టేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
వివరాలు
స్వదేశీ ఆయుధాల అభివృద్ధికి ప్రాధాన్యం
ఇంతకు ముందు కూడా ఇలాంటి క్షిపణి పరీక్షలు భారత్ నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని అధికారులు తెలియజేశారు.
ఇక పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై క్షిపణుల దాడులు జరిపిన విషయం తెలిసిందే.
దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో, భారత్ భారీగా ఆయుధ నిల్వలను పెంచుతోంది.
ఈ క్రమంలో స్వదేశీ ఆయుధాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, ఆయుధాల తయారీని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా వరుసగా క్షిపణి పరీక్షలు కూడా నిర్వహిస్తోంది.