Arogyasri: హైబ్రిడ్ పద్ధతిలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఊహించని షాక్ తగిలింది.హైబ్రిడ్ పద్ధతిలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కీలక ప్రకటన బయటకు వచ్చినట్లు సమాచారం.ఆరోగ్యశ్రీ ట్రస్టు రేంజ్ లో ఉన్న1.60 కోట్ల కుటుంబాలకు గాను ఒక్కో కుటుంబం తరఫున రాష్ట్ర ప్రభుత్వం రూ.1,700 నుంచి రూ.2,000 మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా కంపెనీకి చెల్లించాల్సి రావచ్చని చెబుతున్నారు. వార్షిక బీమా పరిమితి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు లెక్కల ప్రకారం ఈ ఖర్చులోపు చికిత్స పొందేవార్తు 97% వరకు ఉన్నారు. మిగితా 3% వారికి వైద్య ఖర్చులు రూ.2.5 లక్షలు దాటితే ఆ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
రూ.25 లక్షల వరకు చికిత్స పొందుతున్నవారు రాష్ట్రంలో లేరు
ఇప్పుడున్న లెక్కల ప్రకారం.. వార్షిక పరిమితి కింద నిర్దేశించిన రూ.25 లక్షల వరకు చికిత్స పొందుతున్నవారు రాష్ట్రంలో లేరు. అవయవ మార్పిడి, క్యాన్సర్ రోగులకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతోంది. రూ.2.5లక్షలు కాకుండా ఇప్పటివరకు అధికంగా నమోదైన కేసులు రూ.5 లక్షల వరకు ఖర్చయినవి ఉన్నాయి. వార్షిక పరిమితి పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. వార్షిక పరిమితి రూ.2.5 లక్షల ప్రకారం ప్రీమియం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్ల వరకు భరించాల్సి వస్తుంది.
వివిధ రాష్ట్రాలలో హైబ్రిడ్ విధానం అమలు
ఇప్పటికే ,మహారాష్ట్ర, గుజరాత్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో హైబ్రిడ్ విధానం అమలులో ఉండగా మహారాష్ట్రలో రూ.6 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది. ఇందులో రూ.1.5వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా.. ఆపైన అవసరమైతే ట్రస్టు ద్వారా చికిత్స అందిస్తున్నారు. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, నాగాలాండ్, మేఘాలయాలోనూ ఇది ఉంది. ట్రస్టు విధానాన్ని ఏపీతోపాటుగా ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, హరియాణా, బిహార్ తదితర రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. బీమా సంస్థనుబట్టి దేశంలో ఎక్కడైనా చికిత్స పొందే అవకాశముంది.