Page Loader
Andhra Pradesh bandh: ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు 
ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు

Andhra Pradesh bandh: ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు 

వ్రాసిన వారు Stalin
Sep 11, 2023
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతికి సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ టీడీపీ సోమవారం ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో సోమవారం ఉదయం నుంచే టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. టీడీపీ బంద్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కూడా మద్దతు తెలిపారు. తాము కూడా బంద్‌లో పాల్గొంటామని ప్రకటించారు. టీడీపీ బంద్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. ఏపీలో ర్యాలీలు, నిరసనలు చేపట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశించారు.

ఏపీ

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టులు

రాష్ట్రంలో నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేస్తున్నారు. టీడీపీ కీలక నేతలను ఇప్పటికే గృహ నిర్భందం చేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విశాఖపట్నంలో పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, శ్రీరామ్‌లను హౌస్ అరెస్ట్ చేశారు. వీరి ఇంటి వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, హౌస్ అరెస్టులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను టీడీపీ నేతలు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. చిత్తూరులో రోడ్లపై తిరుగుతున్న బస్సులపై పలువురు దాడి చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న బంద్