Page Loader
ఆంధ్రప్రదేశ్‌: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు 
ఆంధ్రప్రదేశ్‌: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు 

వ్రాసిన వారు Stalin
Aug 30, 2023
06:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల తుది రాత పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఎస్సై ఉద్యోగాల నియామకానికి సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. దేహదారుఢ్య ఫలితాలు విడుదలైన వెంటనే రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల చేయనున్నారు. రాత పరీక్షల కోసం విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరులో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌ తెలిపారు.

ఉద్యోగాలు

ఎస్సై రాత పరీక్షలో నాలుగు పేపర్లు

ఎస్సై రాత పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. ఇందులో రెండు పేపర్లు డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో ఉంటాయి. ఇంకో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్‌ టైప్ ఉంటాయి. అక్టోబర్‌ 14వ తేదీన పేపర్‌ 1 పరీక్ష ఉదయం 10 గంటలు- మధ్యాహ్నం 1గంట వరకు ఉంటుంది. అదే రోజు పేపర్ 2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటలు- సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహిస్తారు. అక్టోబర్‌ 15న పేపర్ 3 పరీక్ష ఉదయం 10గంటలు- మధ్యాహ్నం 1గంట వరకు ఉంటుంది. అదే రోజు పేపర్ 4 పరీక్ష మధ్యాహ్నం 2.30గంటలు నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఉంటుంది.