LOADING...
Tejaswi Podapati: పురాతన వస్తువుల విభజనకు కొత్త కమిటీ .. 8 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ.. చైర్‌పర్సన్‌గా తేజస్వీ పొడపాటి
8 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ.. చైర్‌పర్సన్‌గా తేజస్వీ పొడపాటి

Tejaswi Podapati: పురాతన వస్తువుల విభజనకు కొత్త కమిటీ .. 8 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ.. చైర్‌పర్సన్‌గా తేజస్వీ పొడపాటి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల పంపిణీ కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ చర్య, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో ఉన్న ప్రాచీన వస్తువులను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారమే రెండు రాష్ట్రాల మధ్య సరియైన విధంగా విభజించనున్నారు. ఈ నేపథ్యంలో 8 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి, ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి చైర్‌పర్సన్ గా రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వీ పొడపాటి ను నియమించారు. అలాగే పురావస్తు, మ్యూజియంల శాఖ కమిషనర్ కమిటీకి కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

వివరాలు 

కమిటీ సభ్యులుగా: 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి విశ్రాంత ప్రొఫెసర్ వకులాభరణం రామకృష్ణ రిటైర్డ్ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్‌బీ కేశవ్ రిటైర్డ్ ఏడీబీ వాసుదేవాచారి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ ఎం యోగి రెడ్డి కమిటీ,తెలంగాణ రాష్ట్ర కమిటీతో కలిసి సమావేశాలు నిర్వహించి, ప్రతి రాష్ట్రానికి చెందిన పురాతన వస్తువులను గుర్తించడం, ఎంపిక చేయడం,పర్యవేక్షించడం,పంపిణీ చేయడం బాధ్యతగా తీసుకుంటుంది. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురాతన వస్తువులను సకాలంలో రాష్ట్రానికి తరలించి, మ్యూజియాల్లో భద్రపరిచే ప్రక్రియను కూడా చూడనుంది. ఈ సర్వే, గుర్తింపు,పంపిణీ కార్యక్రమాలపై తక్షణ చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ద్వారా పురావస్తు, మ్యూజియంల కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

Advertisement