Annadata Sukhibhava: ఎన్నికల హామీ అమలు దిశగా ఏపీ ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ పథకానికి ముహూర్తం ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయడంలో కసరత్తు చేస్తోంది.
సూపర్ సిక్స్ పథకాల్లో ముందుగా రెండు స్కీంలను అమలుకు కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెలలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ద్వారా మిగిలిన ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.
అదే విధంగా, "అమ్మకు వందనం", "అన్నదాత సుఖీభవ" పథకాలకు నిధుల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
"అన్నదాత సుఖీభవ" పథకం కింద, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ రైతుకు ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు కూటమి నేతలు హామీ ఇచ్చారు.
గతంలో "రతు భరోసా" పేరుతో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని "అన్నదాతా సుఖీభవ"గా పేరు మార్చారు.
వివరాలు
అన్నదాతా సుఖీభవ
ఈ పథకం కింద వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతులకు సహాయం అందించనున్నట్లు సమాచారం.
పథకం అమలుకు విధివిధానాల రూపకల్పన కోసం కసరత్తు చేస్తున్నారు. నిజమైన సాగుదారులను పరిగణనలోకి తీసుకుని, భూ యజమానులు, కౌలు రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.
కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ. 6,000తో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000 కలిపి, మొత్తంగా ఏటా రూ. 20,000 ఇవ్వాలని నిర్ణయించారు.
వివరాలు
ప్రభుత్వం కసరత్తు
ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని పథకాల అమలుకు కసరత్తు చేస్తోంది.
వచ్చే నెలలో ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నది. ఆ బడ్జెట్‌లో సంక్షేమ పథకాల అమలుకు రూ. 20,000 కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం.
"తల్లికి వందనం" పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేసి, మిగిలిన పథకాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలని ఆలోచనలో ఉన్నారు.
ఈ దీపావళి నుండీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఇప్పటికే రూ. 4,000 పెన్షన్ అమలవుతోంది. దీంతో, ఈ రెండు పథకాల అమలుపైన ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.