NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Govt: ఏపీలో మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధం.. .'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    AP Govt: ఏపీలో మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధం.. .'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన 
    ఏపీలో మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధం.. .'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన

    AP Govt: ఏపీలో మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధం.. .'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 18, 2024
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న సమయంలో, ఎన్నికల హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

    ఎన్నికల ప్రచారంలో ప్రకటించినట్లుగా, డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

    సామాజిక పింఛన్లు కూడా 1000 రూపాయలు పెంచి అందిస్తోంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రజలకు అందించడానికి రెడీ అవుతోంది.

    సూపర్ సిక్స్‌ పేరుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇందులో కీలకమైన హామీ "తల్లికి వందనం". వైసీపీ ప్రభుత్వంలో ఈ పథకం "అమ్మ ఒడి" పేరుతో అమలులో ఉంది.

    ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి పేరు మార్చి "తల్లికి వందనం" పేరుతో అమలు చేయబోతున్నది.

    ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏడాదికి 15,000 రూపాయలు జమ చేయనున్నారు.

    వివరాలు 

    సూపర్ సిక్స్ అమలుపై ప్రభుత్వం ఫోకస్

    విద్యాసంవత్సరం జూన్‌లో ప్రారంభమైంది. ప్రభుత్వం కూడా అదే నెలలో కొలువు దీరింది.

    అన్ని సర్దుకొని పథకాలు అమలు చేయడానికి ఇంత టైం పట్టింది. ఆర్థికంగా వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నందున వాటిని సరి చేసేందుకు సమయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది.

    అందువల్ల పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేదని సమాచారం. కేంద్ర సాయంతో వాటన్నింటి నుంచి గట్టెక్కేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

    ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదుట పడుతున్నందున, సూపర్ సిక్స్ అమలుపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు సమాచారం.

    వివరాలు 

    ప్రతి విద్యార్థి తల్లికి 15,000 రూపాయలు 

    సూపర్ సిక్స్ అమలులో "తల్లికి వందనం" పథకంతోనే ప్రారంభించాలని భావిస్తున్నారని తెలిసింది.

    జనవరి 2025లో ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. కాలేజీకి, స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నారు.

    ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నా,అంతమందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

    దీనికి 12,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనాలు వేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు వివిధ స్కూల్స్, కాలేజీల్లో చదువుతున్నారు.

    వారందరికీ ఈ పథకం అమలు చేస్తారా లేదా అందులో కోత విధిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న వారందరికీ అమలు చేస్తే 12,000 కోట్లు కావాల్సి ఉంటుంది.

    వివరాలు 

    మూడు వేలు వరకు కోత

    వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినప్పుడు, ఒక విద్యార్థికి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు.

    అందులో మూడు వేలు వరకు కోత విధించారు. స్కూల్ నిర్వహణకు ఖర్చు చేయడం కోసం వివిధ కారణాలు చెప్పారు. అంతకముందు సంవత్సరం వైసీపీ ప్రభుత్వం ఈ పథకం కింద రూ.6394 కోట్లు ఖర్చు పెట్టింది.

    వివరాలు 

    సూపర్ సిక్స్ ఎప్పుడు అమలవుతుంది:  వైసీపీ 

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, సూపర్ సిక్స్ ఎప్పుడు అమలవుతుందని వైసీపీ ప్రశ్నిస్తోంది.

    ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఉన్నప్పటికీ, "తల్లికి వందనం" ఎందుకు ఇప్పటి వరకు అందించలేదని ప్రశ్నిస్తున్నారు.

    టీడీపీ కూడా దీనికి సమాధానం ఇచ్చింది. 2019 మేలో అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారని గుర్తు చేశారు.

    డేటా, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి సమయం తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    ఆంధ్రప్రదేశ్

    Chandra Babu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి నుంచి మరో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు  చంద్రబాబు నాయుడు
    Coffee: ఐదేళ్లలో కాఫీ సాగు విస్తరణ.. ప్రాజెక్టు వ్యయం రూ.400 కోట్లు భారతదేశం
    Indrakeeladri: అమ్మలగన్నమ్మ.. ఇంద్రకీలాద్రిపై దుర్గామాత మహత్యం విజయవాడ కనకదుర్గ గుడి
    Andhra Pradesh: డ్వాక్రా సంఘాల మహిళలకు సూపర్ స్కీమ్.. ఏపీ ప్రభుత్వం నుంచి 'స్ఫూర్తి'  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025