
Andhrapradesh: ఏపీలో మరో కొత్త విమాన సర్వీస్‌కు రిక్వెస్ట్..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు విమానాశ్రయ అభివృద్ధికి రూ.4.43 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
వీటిలో, రన్‌వే ఎండ్ సేఫ్టీ మెరుగుదలకు (ఆర్‌ఈఎస్‌ఏ) రూ.3.6 కోట్లు ఖర్చు చేయడానికి అనుమతి ఇచ్చింది.
మిగిలిన రూ.83 లక్షలు, విమానాశ్రయ భద్రత కోసం కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్ పరికరాల నిర్వహణకు వినియోగించనున్నారు.
విమాన సర్వీసుల విస్తరణపై టీజీ భరత్ సమావేశం
కర్నూలు విమానాశ్రయ అభివృద్ధిపై చర్చించేందుకు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడిని కలిశారు.
కర్నూలు నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు.
ఈ విషయంపై రామ్మోహన్‌నాయుడు సానుకూలంగా స్పందించారని టీజీ భరత్ తెలిపారు.
వివరాలు
రక్షణ రంగ ప్రాజెక్టులపై చర్చ
'త్వరలో సర్వీసులు ప్రారంభించేలా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. అధికారులు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేపడుతున్నారు. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌లో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలుగుతుంది' అని మంత్రి ఒక ప్రకటనలో వివరించారు.
కర్నూలు విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయడంపై మంత్రి టీజీ భరత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
టీజీ భరత్ ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రతిపాదించిన రక్షణ రంగ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అభ్యర్థించారు.
వివరాలు
ఏపీలో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సమావేశం
'రాష్ట్రంలో రక్షణ రంగ అభివృద్ధికి సంబంధించి అనుమతుల కోసం కేంద్రంతో చర్చించాను. ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని రక్షణ మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష చేపడతామని తెలిపారు. సీఎం చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు' అని టీజీ భరత్ పేర్కొన్నారు.
ఏపీలో ఈ-గవర్నెన్స్‌పై 28వ జాతీయ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సమావేశాన్ని జూన్ రెండో వారంలో విశాఖపట్నంలో జరపనున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సీఎస్ ఛైర్మన్‌గా, వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉన్న టాస్క్‌ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.