LOADING...
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోమే 2026 నాటికి 2 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లోమే 2026 నాటికి 2 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లే లక్ష్యం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోమే 2026 నాటికి 2 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లే లక్ష్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మే 2026 నాటికి 2 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టింది. ఈ క్రమంలో ఫీడర్ సోలారైజేషన్, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల సిద్ధత, పర్యవేక్షణ, అమలు,దీర్ఘకాలిక పనితీరు పర్యవేక్షణకు APSPDCL ప్రత్యేకంగా చర్యలు చేపట్టనుందని ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పేర్కొన్నారు. సీఎస్ హెచ్చరించిన విధంగా, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సోలార్,ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను జవాబుదారీతనంతో, వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. భూసేకరణ, లీజు రిజిస్ట్రేషన్లు, క్లియరెన్స్‌లు, ప్రాజెక్టు అమలు వంటి అంశాలను త్వరగా పూర్తి చేయడం ముఖ్యమని ఆయన సూచించారు.

వివరాలు 

ఫీల్డ్ ఆఫీసర్లకు సీఎస్ ప్రత్యేక ఆదేశాలు

ప్రభుత్వం సోలార్ రూఫ్‌టాప్ పై అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టనుంది. వినియోగదారులు అప్లికేషన్ సమర్పించిన వెంటనే వేగవంతమైన ఆమోదం కోసం విధానాలను సరళీకరించనుంది. మెరుగైన సేవలు అందించడం ద్వారా మార్చి 2026 నాటికి 1.5 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లను పూర్తి చేయడం, మిగిలిన వాటిని మే 2026 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా ఉంది. వీటితో పాటు, వినియోగదారులకు ఇబ్బంది రాకుండా మీటర్లు సరిగ్గా అమర్చడానికి ఫీల్డ్ ఆఫీసర్లకు సీఎస్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. లోపాలు లేకుండా ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా డివిజనల్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లను బాధ్యతలలో భాగం చేసారు.

వివరాలు 

ప్రతి గృహానికి రూ.78,000 వరకు సబ్సిడీ

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద కేంద్ర ప్రభుత్వం గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. ఈ పథకంలో ప్రతి గృహానికి రూ.78,000 వరకు సబ్సిడీ అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. దీనివల్ల ప్రతి నెలా సుమారు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. అదనంగా, మిగిలిన కరెంట్‌ను డిస్కంలకు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. కేంద్రం దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఈ పథకాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టింది. ఇప్పటివరకు 25 లక్షల ఇళ్లకు పథకం పూర్తయింది. ఏపీ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

Advertisement