Page Loader
Andhrapradesh: జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి.. జిల్లా అధికారులకు ఆదేశాల జారీ
జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి.. జిల్లా అధికారులకు ఆదేశాల జారీ

Andhrapradesh: జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి.. జిల్లా అధికారులకు ఆదేశాల జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2024
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్నాయి. పట్టణాలు,గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల అభివృద్ధి,ఇతర అంశాల ఆధారంగా ప్రస్తుతం ఉన్న విలువలపై 10% నుంచి 15% వరకు పెంపు చేసే అవకాశం ఉంది. గత వైసీపీ పాలనలో చోటు చేసుకున్న అసమానతలు లేకుండా, శాస్త్రీయ విధానంలో విలువల పెంపును చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ విలువలతో పాటు నిర్మాణ (స్ట్రక్చర్)విలువలను కూడా సవరించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో, నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్ధం చేసిన సవరణ ప్రతిపాదనలకు జిల్లా కమిటీల ఆమోదం పొందిన తర్వాత ఈ నెల 20న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచనున్నారు.

వివరాలు 

కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు

జనసాధారణ నుంచి అభ్యంతరాలు, సూచనలు ఈ నెల 24 వరకు స్వీకరించనున్నారు. ఈ ప్రతిపాదనల పరిశీలనను ఈ నెల 27వ తేదీ వరకు పూర్తి చేయనున్నారు. 2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్,స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు సోమవారం జిల్లా రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్ విలువల పెంపులో నిర్దిష్టమైన విధానాలు పాటించకపోవడంతో వచ్చిన అసమానతలను, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా తొలగించేందుకు కృషి జరుగుతోంది.