Page Loader
వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు: సమాధానం చెప్పాలంటూ ట్వీట్
వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు

వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు: సమాధానం చెప్పాలంటూ ట్వీట్

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 23, 2023
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా మరోమారు వాలంటీర్ల వ్యవస్థపై పవన్ ప్రశ్నలు వేసారు. ట్విట్టర్ వేదికగా తన ప్రశ్నలను సంధించిన పవన్ కళ్యాణ్, మొదటగా.. వాలంటీర్లకు బాస్ ఎవరని ప్రశ్నించారు. రెండవ ప్రశ్నగా, వాలంటీర్లు సేకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారో చెప్పాలని అన్నారు. ఇక మూడవ ప్రశ్నగా, వాలంటీర్లు ప్రభుత్వ అధికారులు కానప్పుడు, ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కు వాళ్ళకు ఎక్కడుంది అని అడిగారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ ప్రశ్నలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ ప్రశ్నలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ ట్వీట్