Page Loader
Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక
జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక

Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2024
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలోని అనేక మధ్య, చిన్నతరహా జలాశయాల్లో పూడిక పెరుగుతున్నట్లు కేంద్ర జలసంఘం చేపట్టిన రిమోట్‌ సెన్సింగ్‌ సర్వే, రాష్ట్ర ప్రభుత్వ హైడ్రోగ్రాఫిక్‌ సర్వేల ఆధారంగా ఈ నివేదికను కేంద్ర జలసంఘం రూపొందించింది. ఈ నివేదికలో 10 ప్రధాన జలాశయాల వివరాలు వెల్లడించాయి. వాటిలో 8 జలాశయాలు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గాయి. కేంద్ర జలసంఘం రూపొందించిన ఈ నివేదిక రిమోట్ సెన్సింగ్ సర్వేలు, రాష్ట్ర ప్రభుత్వ హైడ్రోగ్రాఫిక్ సర్వేల ఆధారంగా సేకరించారు. శ్రీశైలంలో 45 సంవత్సరాల్లో మొత్తం 102.11 టీఎంసీల నీటి నిల్వ తగ్గింది. 1976లో 308 టీఎంసీలు నిల్వ చేసిన శ్రీశైలం, 2021 సర్వే ప్రకారం 205.91 టీఎంసీలకు పడిపోయింది.

Details

కంభం చెరువులో 2.97 టీఎంసీల నీరు తగ్గింది

కంభం చెరువులో 1956లో 3.73 టీఎంసీలు నిల్వ చేశారు, 1978 నాటికి 2.97 టీఎంసీలకు తగ్గింది. ఇక మైలవరం జలాశయంలో 1969లో 7 టీఎంసీలు నిల్వ చేయగా, 2021లో 0.76 టీఎంసీల మేర తగ్గి 6.24 టీఎంసీలకు చేరింది. రైవాడ జలాశయంలో 1982లో 3.59 టీఎంసీల నీటిని నిల్వ చేశారు, 2023 నాటికి 3.125 టీఎంసీలకు పడిపోయింది. రాళ్లపాడు చెరువులో 1958లో 1.106 టీఎంసీల నిల్వ సామర్థ్యం పెరిగి 2021 నాటికి 1.443 టీఎంసీలను చేరుకుంది. తాండవ జలాశయంలో 1975లో 4.96 టీఎంసీల నిల్వ, 2023 నాటికి 4.39 టీఎంసీలకు పడిపోయింది.

Details

నీటి సామర్థ్యంపై తీవ్ర ఆందోళన

వంశధార ప్రాజెక్టులో 1977లో 0.66 టీఎంసీలు నిల్వ చేయగలిగితే, 2004 నాటికి 0.25 టీఎంసీలకు తగ్గింది. ఏలేరు జలాశయంలో 1991లో 24.10 టీఎంసీల నిల్వ, 2021 నాటికి 23.21 టీఎంసీలకు తగ్గింది. ఈ వివరాలు జలశయాల నిర్వహణ, వాటి పూడిక సమస్యలు, నీటి నిల్వ సామర్థ్యంపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రానికి సమర్థవంతమైన నీటి నిర్వహణ అవసరమనే విషయాన్ని ఈ నివేదిక స్పష్టంగా నొక్కిస్తుంది.