తదుపరి వార్తా కథనం

బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ
వ్రాసిన వారు
Stalin
Apr 06, 2023
05:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పదమైన బీబీసీ డాక్యుమెంటరీని విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగడంతో జనవరిలో ఆయన కాంగ్రెస్‌కతు రాజీనామా చేశారు.
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, వి మురళీధరన్, కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ అనిల్ అంటోనీని బీజేపీలోకి స్వాగతించారు.
అనిల్ ఆంటోనీ బీబీసీ డాక్యుమెంటరీపై వివాదం తర్వాత పార్టీని వీడే ముందు కేరళలో కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్‌ను నడిపారు.
బీబీసీ డాక్యుమెంటరీని అనిల్ ఆంటోనీ తప్పు పట్టారు. భారత వ్యతిరేక ధోరణిగా దాన్ని అభివర్ణించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్
Shri @anilkantony joins BJP in presence of Shri @PiyushGoyal at party headquarters in New Delhi. #JoinBJP https://t.co/yQXskBy8JM
— BJP (@BJP4India) April 6, 2023