Page Loader
Anna Canteen: గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు.. 7చోట్ల కొత్త క్యాంటీన్లకు అనుమతి

Anna Canteen: గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు.. 7చోట్ల కొత్త క్యాంటీన్లకు అనుమతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2025
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్ల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లో మాత్రమే ప్రారంభించిన ఈ క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లోకి విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఈక్రమంలో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్న ఏడు ప్రాంతాల్లో కొత్త క్యాంటీన్ల ఏర్పాటు కోసం అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి,గుంటూరు జిల్లా దుగ్గిరాల,చిత్తూరు జిల్లాలో శాంతిపురం, గుడిపల్లి,రామకుప్పం,కుప్పం గ్రామీణం,కాకినాడ జిల్లా ఉప్పాడ-కోటపల్లి ఉన్నాయి. ఈ క్యాంటీన్ల నిర్మాణానికి మొత్తం రూ.4.47కోట్లు వ్యయం చేయనున్నారు.ఈ నిధులు పురపాలక శాఖ, సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థల నిధుల నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అంతేకాకుండా, ఇప్పటికే హైకోర్టు పరిధిలో, అలాగే కుప్పం ప్రాంతంలో ప్రారంభమైన రెండు అన్న క్యాంటీన్లను అధికారికంగా ఆమోదిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

7 అన్నా క్యాంటీన్లు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు