Page Loader
Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి 
Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి

Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి 

వ్రాసిన వారు Stalin
Jan 21, 2024
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై ప్రస్తుతం అసోంలో జరుగుతోంది. ఈ క్రమంలో యాత్రలో పాల్గొన్న నాయకలపై బీజేపీ నాయకులు దాడి చేసిన కాంగ్రెస్ ఆరోపించింది. అసోంలోని ఆదివారం సోనిత్‌పూర్ జిల్లాలో పార్టీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు హాజరైన తమ సీనియర్ నాయకుడు జైరాం రమేష్, అతని కెమెరామెన్‌ల కారును బిజెపి కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు కాంగ్రెస్ పేర్కొంది. అసోంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. రాహుల్ గాంధీ నాగోన్ జిల్లాలోని కలియాబోర్‌లో ప్రసంగించే ముందు ఈ దాడి జరిగింది.

రాహుల్

మీడియా ప్రతినిధులపై దాడి: కాంగ్రెస్

'భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు మందు అదే మార్గంలో బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో యాత్ర కోసం వెళ్తున్నకొన్ని వాహనాలు ఆ ప్రాంతం గుండా వెళుతున్నాయి. ఆ సమయంలో కొన్ని వాహనాలపై బీజేపీ దాడి చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేశారని ఏఐసీసీ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ మహిమా సింగ్ పేర్కొన్నారు. జైరాం రమేష్, మరికొందరు ప్రయాణిస్తున్న కారు.. జముగురిఘాట్ సమీపంలో జరుగుతున్న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' బృందంలో చేరడానికి వెళుతుండగా.. ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు.