INS Malvan: భారత నౌకాదళంలోకి మరో శక్తి.. జులై 22న ఐఎన్‌ఎస్ మాలవన్ ప్రారంభం!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 19, 2026
09:11 am
ఈ వార్తాకథనం ఏంటి
భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచే మరో అత్యాధునిక యుద్ధనౌక త్వరలో సేవల్లోకి రానుంది. కొచ్చిలో ఈ నెల 22న ఐఎన్‌ఎస్ మాలవన్‌ను అధికారికంగా నౌకాదళానికి అంకితం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను భారత నావికాదళ అధికారులు ఇప్పటికే చేపట్టారు. ఐఎన్‌ఎస్ మాలవన్ చేరికతో ఈ శ్రేణికి చెందిన రెండో యుద్ధనౌక నౌకాదళంలోకి ప్రవేశించనుంది. ఇదే శ్రేణిలోని తొలి నౌక 'ఐఎన్‌ఎస్ మహే'ను 2025 నవంబరులో దేశానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వరుసలో రెండో నౌకగా ఐఎన్‌ఎస్ మాలవన్ అధికారికంగా తన సేవలను ప్రారంభించనుంది.
వివరాలు
రెండు దశాబ్దాల తర్వాత చేరిక
కాగా ఇదే పేరుతో గతంలో సేవలందించిన పాత 'ఐఎన్‌ఎస్ మాలవన్' యుద్ధనౌకను 2003 జనవరి 3న భారత నౌకాదళం నుంచి విరమింపజేశారు.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అదే పేరుతో కొత్త యుద్ధనౌక మళ్లీ భారత నావికాదళంలో చేరనుండటం విశేషంగా భావిస్తున్నారు.