Loading...
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. 19వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్స్!
ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. 19వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్స్!

Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. 19వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కు వరుస తుఫాన్ల ముప్పు తప్పేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు సమాచారం. దీని ప్రభావంతో సముద్రంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశముంది.

వివరాలు

19వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్స్

ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడి ఎల్లుండి నాటికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

ఆ తర్వాత మరింత బలపడి ఈ నెల 19వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి.

వివరాలు

విశాఖ నుంచి మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం?

ఈ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై పడే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి.

ముఖ్యంగా విశాఖపట్నం నుంచి మచిలీపట్నం మధ్య తీర ప్రాంతంలో తుఫాన్ తీరం దాటే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అయితే తుఫాన్ తీవ్రత, దిశ, తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రానున్న రోజుల్లో వాతావరణ శాఖ వెల్లడించే తాజా బులెటిన్ల ఆధారంగా తుఫాన్ కదలికలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తీర ప్రాంత ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

వరుస తుఫాన్లతో ఆందోళన

ఇప్పటికే వరుసగా వచ్చిన రెండు తుఫాన్లు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.

ఈ నేపథ్యంలో మరో తుఫాన్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

రాబోయే తుఫాన్ ఎలాంటి ప్రభావం చూపుతుందోనని తీర ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.

ADVERTISEMENT