Page Loader
జమ్ముకశ్మీర్‌‌లో మరో ఎన్‌కౌంటర్‌- ఇద్దరు ఉగ్రవాదులు హతం 
జమ్ముకశ్మీర్‌‌లో మరో ఎన్‌కౌంటర్‌- ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌‌లో మరో ఎన్‌కౌంటర్‌- ఇద్దరు ఉగ్రవాదులు హతం 

వ్రాసిన వారు Stalin
May 04, 2023
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక ఏకే 47 రైఫిల్‌తో పాటు, ఒక పిస్టల్‌తో సహా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో గత 24 గంటల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులు స్థానికులు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీకి చెందినవారు. ఎన్‌కౌంటర్‌ అయిన వారిని షోపియాన్ జిల్లాకు చెందిన షకీర్ మాజిద్ నజర్, హనన్ అహ్మద్ సేగా గుర్తించారు.

జమ్ము

పక్కా సమాచారంతో కార్డన్ అండ్ సెర్చ్ 

షకీర్ మాజిద్ నజర్, హనన్ అహ్మద్ ఈ ఏడాది మార్చి నెలలో ఎల్ఈటీలో చేరారని పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారంతో భద్రతా బలగాలు గురువారం తెల్లవారుజామున అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. బలగాల సెర్చ్ పార్టీపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని చెప్పారు. పిచ్‌నాడ్ మచిల్ సెక్టార్ సమీపంలో జమ్ముకశ్మీర్ పోలీసులు, సైన్యం ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.