LOADING...
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక అరెస్ట్.. పోలీసుల అదుపులో మనీషా
నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక అరెస్ట్.. పోలీసుల అదుపులో మనీషా

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక అరెస్ట్.. పోలీసుల అదుపులో మనీషా

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2026
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న వేళ, ఈ కేసులో మరో కీలక సూత్రధారిని అధికారులు అరెస్టు చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు దిల్లీలో విచారణ నిర్వహించిన అనంతరం పుణెకు చెందిన బోటనీ టీచర్ మనీషా గురునాథ్ మందరేను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం.. నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన బయాలజీ ప్రశ్నపత్రం లీక్‌లో ఆమె కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తున్న సీబీఐ, పేపర్ లీక్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తోంది.

Advertisement