Page Loader
కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం
కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం

కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం

వ్రాసిన వారు Stalin
May 09, 2023
06:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికా దేశం నమీబియా నుంచి భారతదేశానికి తీసుకొచ్చిన వచ్చిన మరో చిరుత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చనిపోయిందని అధికారులు తెలిపారు. 40 రోజుల్లో ఇది మూడో మరణంగా మంగళవారం పేర్కొన్నారు. కునో నేషనల్ పార్క్‌లో పర్యవేక్షణ బృందం మంగళవారం ఉదయం గాయపడిన స్థితిలో ఉన్న ఆడ చిరుత దక్షను గుర్తించిందని, వెంటనే అవసరమైన మందులు, చికిత్స అందించినట్లు చెప్పారు. కానీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ చిరుత మృతి చెందినట్లు అటవీ అధికారి ధృవీకరించారు. చిరుతల మధ్య జరిగిన ఘర్షణ వల్లే దక్ష గాయపడిందని అధికారులు చెప్పారు. అయితే ఇది సాధారణ విషయం అని తెలిపారు.

చిరుత

70 ఏళ్ల తర్వాత భారత్‌కు చిరుతల రాక

70 సంవత్సరాల క్రితం దేశంలో కనుమరుగైన జాతులను పునరుద్ధరించే ప్రణాళిక భాగంగా సెప్టెంబర్, ఫిబ్రవరిలో మొత్తం 20 చిరుతలను విదేశాల్లో నుంచి కునో నేషనల్ పార్క్‌కు తరలించారు. గతంలో మార్చి 27న ఒక ఆడ చిరుత, ఏప్రిల్ 23న మగ చిరుత మృతి చెందాయి. ఈ మరణాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆందోళన కలిగించినట్లు, అయితే మిగిలినవి బాగానే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. మిగతా చిరుతలను నిశితంగా పరిశీలించామని, వాటిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.