LOADING...
AP Govt : ఏపీ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు నేరుగా అధికారులు
ఏపీ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు నేరుగా అధికారులు

AP Govt : ఏపీ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు నేరుగా అధికారులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలో ప్రజా మేలు లక్ష్యంగా పలు వినూత్న కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. ఎన్నికల హామీల్లో భాగమైన 'సూపర్ సిక్స్' పథకాలతో పాటు, పేదవర్గాలు మరియు రైతులకు అదనపు ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తెస్తోంది. ఈక్రమంలో మరో కొత్త కార్యక్రమం 'రైతన్నా మీకోసం' ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కార్యక్రమ ముఖ్యోద్దేశం—వ్యవసాయ రంగంలో పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే లాభాలను ఇంటింటికీ వెళ్లి వివరించడం. ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లి వారికి అవగాహన కల్పించనున్నారు.

Details

రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రత్యేక వర్క్‌షాపులు

అదనంగా డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహించబడతాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖల నుంచి సుమారు 10 వేల మంది సిబ్బందితో సీఎం చంద్రబాబు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచసూత్రాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నీటిభద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌, ఫుడ్ ప్రాసెసింగ్‌, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలను పంచసూత్రాలుగా రూపొందించినట్టు తెలిపారు. ఈఅవగాహన కార్యక్రమం రైతులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పాడి, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం, ఆక్వా, ఉద్యాన, సెరికల్చర్ రంగాల్లో ఉన్న రైతులకూ ఇదే సమాచారం అందించాలని ఆయన ఆదేశించారు.

Details

శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతులకు గిట్టుబాటు

రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం పోలీసులు తెలిపారు. 'రైతన్నా మీకోసం' కార్యక్రమం ద్వారా శాస్త్రీయ వ్యవసాయమే రైతులకు గిట్టుబాటు అందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పంటలకు ఆధునిక పద్ధతులు, విలువ ఆధారిత ప్రాసెసింగ్‌ చేరుస్తూ ఇంటింటికీ అధికారులు వివరణ ఇవ్వనున్నారు. అలాగే రైతులు ఎలాంటి పంటలు వేశారు, వారికి అవసరమైన మద్దతు ఏంటన్న విషయాలను నేరుగా తెలుసుకునే అవకాశం కూడా ఈ కార్యక్రమం ద్వారా కలుగనుంది. సాగులో అధిక పురుగుమందుల వినియోగం వల్ల కలిగే నష్టాలు, తక్కువ వినియోగం వల్ల పొందే లాభాలు, సేంద్రీయ విధానంలో పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో ఉన్న భారీ డిమాండ్ గురించి కూడా అధికారులు రైతులకు వివరించనున్నారు.