
Telangana: పాశమైలారం ఘటనలో మరో వ్యక్తి మృతి.. 41కి చేరిన మరణాల సంఖ్య
ఈ వార్తాకథనం ఏంటి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం మండలంలోని సిగాచీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జితేందర్ అనే వ్యక్తి ఆదివారం ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది. ఇక మరో మృతదేహం వివరాలను కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో గల్లంతైన తొమ్మిది మంది ఇంకా లభించలేదు. వారి ఆచూకీ తెలియకపోవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Details
మృతుల సంఖ్య పెరుగుతోంది
పేలుడు తీవ్రతకు పూర్తిగా కుప్పకూలిపోయిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయి ఉండవచ్చన్న అనుమానంతో రెస్క్యూ టీములు సుదీర్ఘంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ విషాద ఘటన పాశమైలారం ప్రాంతాన్ని తారుమారు చేసింది. గల్లంతైన వారి ఆచూకీపై ఇంకా స్పష్టత రాకపోవడం, మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మరింత ముదురుతోంది.