LOADING...
Begumpet: మహిళా పైలట్‌పై మరో పైలట్ అత్యాచారం 
మహిళా పైలట్‌పై మరో పైలట్ అత్యాచారం

Begumpet: మహిళా పైలట్‌పై మరో పైలట్ అత్యాచారం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2025
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

బేగంపేట పోలీస్‌ స్టేషన్ పరిధిలో మహిళా అసిస్టెంట్‌ పైలట్‌పై జరిగిన అమానుష ఘటన బయటకు వచ్చింది. మరో పురుష పైలట్ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటన విషయంలో బాధితురాలు రెండు రోజుల క్రితం బేగంపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం—ఈ నెల 20న బాధితురాలు బేగంపేట నుంచి బిజినెస్‌ ఫ్లైట్‌లో పుట్టపర్తి, చెన్నై మీదుగా బెంగళూరుకు ప్రయాణించింది. సాయంత్రం 4.20 గంటలకు విమానం బెంగళూరు చేరుకుంది.

Details

బేగంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

అనంతరం బాధితురాలు, ఆమెతో ప్రయాణించిన మరో ఇద్దరు పురుష పైలట్లతో కలిసి అక్కడి హోటల్‌లో బస చేశారు. కొంతసేపటికి ముగ్గురూ కలిసి బయటకు వెళ్లి, తిరిగి హోటల్‌కి చేరుకున్నారు. అదే సమయంలో ఆ పురుష పైలట్‌ ఆమెపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన బాధితురాలు వెంటనే బేగంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై జీరో ఎఫ్‌ఐఆర్‌గా కేసు నమోదు చేసి, దీనిని విచారణ కోసం బెంగళూరుకు ట్రాన్స్‌ఫర్ చేశారు.