INDIA bloc: ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ.. ఒంటరిగా పోరాటానికి సిద్దమైన ఫరూక్ అబ్దుల్లా
ఇండియా బ్లాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా నేషనల్ కాన్ఫరెన్స్ తన మెరిట్‌తో ఎన్నికల్లో పోటీ చేస్తుందని పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. "సీట్ల భాగస్వామ్యానికి సంబంధించినంతవరకు, నేషనల్ కాన్ఫరెన్స్ తన సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. దాని గురించి రెండు అభిప్రాయాలు లేవు. ఇకపై దీనిపై ఎలాంటి ప్రశ్నలు ఉండకూడదు," అని అబ్దుల్లా అన్నారు. గత నెలలో అబ్దుల్లా ఇండియా కూటమి సీట్ల షేరింగ్ ఏర్పాట్లపై ఏకాభిప్రాయం లేకపోవడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ఫరూక్ అబ్దుల్లా కి ఈడీ సమన్లు
మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ యూట్యూబ్ ఛానెల్‌పై మాట్లాడుతూ, అబ్దుల్లా ఒక ఒప్పందానికి రావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. "మనం దేశాన్ని రక్షించాలంటే, మనం విభేదాలను మరచిపోయి దేశం గురించి ఆలోచించాలి" అని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది.అయితే వీటిని ఆయన దాటవేసారు.