LOADING...
Metro project: విశాఖ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు.. ADB ప్రతినిధులతో అధికారుల సమీక్ష
విశాఖ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు.. ADB ప్రతినిధులతో అధికారుల సమీక్ష

Metro project: విశాఖ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు.. ADB ప్రతినిధులతో అధికారుల సమీక్ష

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులో కీలకమైన ముందడుగు పడింది. ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను మెట్రో రైల్ అధికారులు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ప్రతినిధులు కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా, ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అయన తెలిపిన ప్రకారం, కొమ్మాది నుంచి కూర్మన్నపాలెం వరకు ఉన్న అన్ని మెట్రో స్టేషన్ల కోసం గుర్తించిన ప్రాంతాలన్నింటినీ సమీక్షించామని తెలిపారు. మొత్తం 46.23 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గంలో 43 స్టేషన్లు నిర్మించనున్నట్టు వివరించారు.

Details

రూ.11వేల కోట్ల వ్యయం

ఈ మెట్రో ప్రాజెక్టు తొలి దశకు దాదాపు రూ.11,000 కోట్లు వ్యయం అవుతుందని ఆయన అంచనా వేశారు. ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, శాసన, ఆర్థిక అంశాల్లో అన్ని అనుమతులు దక్కించుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రస్తుతంగా ఈ ప్రాజెక్టు ADB సహకారంతో పురోగమిస్తున్న నేపథ్యంలో, మెట్రో అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.