Page Loader
Salman Khan: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌‌కు మరోసారి బెదిరింపు
బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌‌కు మరోసారి బెదిరింపు

Salman Khan: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌‌కు మరోసారి బెదిరింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2024
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తి నుంచి మరోసారి బెదిరింపు సందేశం వచ్చింది. ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి చేరుకున్న ఈ సందేశంలో ఖాన్ రెండు కోట్ల రూపాయలు చెల్లించకపోతే అతనిని హత్య చేస్తామనే హెచ్చరికలు చేయడం విశేషం. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవలే మరో సందేశంలో సల్మాన్ ప్రాణాలకు ముప్పు ఉండటంతో పాటు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సవాలుగా నిలిచిన నేపథ్యంలో రూ. 5 కోట్లు చెల్లించాలని బెదిరింపులొచ్చిన విషయం తెలిసిందే.

Details

గతంలో కూడా బెదిరింపులు

ఆ సందేశం పంపిన వ్యక్తి అనంతరం తాను క్షమాపణలు తెలిపారు. పోలీసులు ఆ వివరాలను సీరియస్‌గా తీసుకుని పలు బృందాలుగా ఏర్పడి, జార్ఖండ్‌ పోలీసులు సహాయంతో జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణజింక వేట కేసులో వివాదంలో ఉన్న సల్మాన్ ఖాన్‌ను గతంలో కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్య నేపథ్యంలో బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో సల్మాన్‌కు తిరిగి బెదిరింపులు రావడం చిత్ర పరిశ్రమను కలవరపరుస్తోంది.