Page Loader
తొలకరి కోసం రైతుల ఎదురుచూపు; మూడు రోజుల తర్వాత వర్షాలపై క్లారిటీ
తొలకరి కోసం రైతుల ఎదురుచూపు; మూడు రోజుల తర్వాత వర్షాలపై క్లారిటీ

తొలకరి కోసం రైతుల ఎదురుచూపు; మూడు రోజుల తర్వాత వర్షాలపై క్లారిటీ

వ్రాసిన వారు Stalin
Jun 16, 2023
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు తొలకరి జల్లుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. జూన్ 11న నైరుతి రుతుపవనాలు ఏపీకి తాకినా ఆ తర్వాత పెద్దగా విస్తరించలేదు. అయితే రుతుపవనాలు జూన్ 19నుంచి వేగం పుంజుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆ తేదీ తర్వాతే రుతుపవనాలపై క్లారిటీ వస్తుందని తెలిపింది. జూన్ 8న దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ ప్రకటించింది. కానీ అవి విస్తరించడం ఆలస్యం అయ్యాయి. సాధారణంగా జూన్ రెండోవారం నాటికి ఉష్ణోగ్రతలు తగ్గాలి. రుతుపవనాల ఆలస్యం వల్ల ఉష్ణోగ్రతలు ఏమాాత్రం తగ్గడం లేదు. బిపోర్‌జాయ్ తుపాను వల్ల ఏర్పడిన బలమైన గాలులు తేమను తీసుకెళ్లడంతో రుతువనాల విస్తరణ ఆగిపోయినట్లు ఐఎండీ వెల్లడించింది.

వానలు

తెలంగాణలోని 16జిల్లాల్లో వడగాలుల హెచ్చరిక

జూన్ 19 నాటికి రుతుపవనాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, 21వ తేదీ నాటికి ద్వీపకల్పం, తూర్పు భారతదేశంలోని మరిన్ని ప్రాంతాలకు అవి విస్తరిస్తాయని ఆశిస్తున్నట్లు ఐఎండీ పేర్కొంది. జూన్ చివరి వారం నాటికి రుతుపవనాలు దేశమంతా పుంజుకుంటాయని, మధ్య, వాయువ్య భారతదేశంలో అప్పటి వరకు వర్షాలు కురవకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జూన్ 10న తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేశారు. కానీ అలా జరగకపోడవంతో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. అత్యధికంగా 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని 16జిల్లాల్లో బలమైన వడగాలుల వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అంతేకాకుండా ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 నుంచి 6.7డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొంది.