LOADING...
భారత క్రీడాకారులకు వీసా నిరాకరించిన చైనా.. ఆసియా గేమ్స్ పర్యటనను రద్దు చేసుకున్న అనురాగ్ ఠాకూర్
భారత క్రీడాకారులకు వీసా నిరాకరించిన చైనా

భారత క్రీడాకారులకు వీసా నిరాకరించిన చైనా.. ఆసియా గేమ్స్ పర్యటనను రద్దు చేసుకున్న అనురాగ్ ఠాకూర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2023
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించింది. దీంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ముగ్గురు భారతీయ వుషు ఆటగాళ్లు నైమాన్ వాంగ్సు, ఒనిలు తేగా, మెపుంగ్ లాంగులకు చైనాలో ప్రవేశం నిరాకరించడంతో ఆ దేశ పర్యటను అనురాగ్ ఠాకూర్ రద్దు చేసుకున్నట్లుగా కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆటగాళ్లను రాకుండా ఆపడం ఆసియా గేమ్స్ నిబందనలకు విరుద్ధమని, అరుణాచల్ ప్రదేశ్ భారత్ భాగమని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఆసియా క్రీడల స్ఫూర్తిని, నియమాలను చైనా ఉల్లంఘిస్తోందని ఆయన మండిపడ్డారు.

Details

ఆసియా గేమ్స్ కు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన చైనా

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ముగ్గురు భారత 'వుషు' ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా రద్దు చేసింది. చైనా తీరుపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆటగాళ్ల ప్రవేశాన్ని చైనా రద్దు చేయడం ఆసియా గేమ్స్ నిబంధనకు విరుద్ధమని తెలిపింది. దీనిపై చర్యలను తీసుకుంటామని పేర్కొంది. దీంతో భారత ఆటగాళ్లను దిల్లీకి తీసుకొచ్చింది. ఈ అంశంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. ఆతిథ్య దేశంగా, చట్టబద్ధంగా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు హాంగ్‌జౌకు రావాలని, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ప్రభుత్వం గుర్తించలేదని ఆయన వ్యాఖ్యనించారు.