Loading...
AP: ఏపీలో మేయర్‌ పీఠాల పంపకాలపై కూటమి కసరత్తు.. నేడు కీలక భేటీ
ఏపీలో మేయర్‌ పీఠాల పంపకాలపై కూటమి కసరత్తు.. నేడు కీలక భేటీ

AP: ఏపీలో మేయర్‌ పీఠాల పంపకాలపై కూటమి కసరత్తు.. నేడు కీలక భేటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల మేయర్‌ స్థానాలను మూడు పార్టీల మధ్య సర్దుబాటు చేసే అంశంపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పంపకాలపై తుది నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పీవీఎన్‌ మాధవ్‌ సోమవారం సాయంత్రం సమావేశం కానున్నారు.

వివరాలు 

జనసేనకు మూడు మేయర్‌ స్థానాలు దక్కేనా?

ప్రాథమిక సమాచారం ప్రకారం, జనసేన నాలుగు మేయర్‌ స్థానాలను ఆశిస్తోంది.

అయితే, ఆ పార్టీకి మూడు స్థానాలు కేటాయించే అంశంపై కూటమిలో సానుకూలత ఉన్నట్లు తెలుస్తోంది.

విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ నగరపాలక సంస్థల మేయర్‌ స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు, తిరుపతి మేయర్‌ పీఠాన్ని బీజేపీకి అప్పగించే అంశంపై చర్చలు దాదాపు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

మిగిలిన నగరపాలక సంస్థల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశముంది.

వివరాలు 

గెలుపే ప్రామాణికంగా స్థానాల సర్దుబాటు

సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలను ప్రామాణికంగా తీసుకుంటూనే, పొత్తు ధర్మానికి విఘాతం కలగకుండా స్థానాలను సర్దుబాటు చేయాలని నేతలు భావిస్తున్నారు.

ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయ కమిటీలు స్థానిక పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో పార్టీల బలాబలాలపై ప్రాథమిక నివేదికలను సిద్ధం చేశాయి.

ఈ నివేదికలను పరిగణనలోకి తీసుకుని స్థానాల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

మున్సిపాలిటీలు, జడ్పీ స్థానాలపైనా చర్చలు

సోమవారం సాయంత్రం జరిగే సమావేశంలో నగరపాలక సంస్థల మేయర్‌ స్థానాలతో పాటు మున్సిపాలిటీల్లోని పదవుల పంపకాలపైనా చర్చించనున్నారు.

జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఏ పార్టీకి కేటాయించాలనే అంశాలపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూటమి వర్గాలు వెల్లడించాయి.

ఈ భేటీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

ADVERTISEMENT