AP-Amith Sha-Election Campaign: గూండాగిరి, అవినీతిని అంతం చేయడానికే పొత్తు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో భూకబ్జాలు గూండాగిరి, అవినీతి నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నామని కేంద్రమంత్రి అమిత్ షా (Amith Sha) పేర్కొన్నారు. ఏపీలో అవినీతిని అంతమొందించేందుకు ఈ పొత్తు ఉపయోగపడుతుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆహ్వానం పంపినా రాలేదని మండిపడ్డారు. ఏపీ ప్రజలపై 13 లక్షల కోట్ల అప్పుల భారం మోపారన్నారు.
మద్య నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ లు ఏర్పాటు చేశారు
2019 ఎన్నికల్లో మద్యపానం నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్ లు ఏర్పాటు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక అవకాశం ఇవ్వండి అని అడిగి అధికారులకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులను గాలికి వదిలేసారు అన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఏపీలో చంద్రబాబును సీఎంగా చేయాలని కేంద్రంలో ప్రధాని మోడీని ప్రధాని చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. అదే విధంగా కూటమి అభ్యర్థి సత్యకుమార్ ను ధర్మవరంలో గెలిపించాలని కూడా కోరారు. ఇప్పటివరకు జరిగిన రెండు దశల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లకు పైగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు