LOADING...
AP BJP: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..?
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..?

AP BJP: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయం తుదిదశకు చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్‌ను నూతన అధ్యక్షుడిగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. గతంలో ఆయన బీజేపీలో శాసన మండలిలో ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనుంది. పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన అభ్యర్థి నామినేషన్‌ను అధికారికంగా దాఖలు చేయనున్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అదే రోజు అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈఎన్నికకు కర్ణాటక ఎంపీ మోహన్‌ను కేంద్ర పరిశీలకుడిగా నియమించారు.

Advertisement