Page Loader
BJP JANASENA : 'పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు.. ఏపీలోనూ కలిసే వెళ్తాం'
BJP JANASENA : 'పొత్తపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు.. ఏపీలోనూ కలిసే వెళ్తాం'

BJP JANASENA : 'పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు.. ఏపీలోనూ కలిసే వెళ్తాం'

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 17, 2023
06:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపై బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీజేపీ, జనసేన పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు ఇతర అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వం ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటుందన్నారు. అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్న పురందేశ్వరి, ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేస్తామన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన దగ్గుబాటి పురందేశ్వరి ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని వైసీపీ సర్కార్ గాలికొదిలేసిందన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలతో కాలం గడుపుతోందని మండిపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ అధ్యక్షులతో సమావేశమైన పురందేశ్వరి