AP Cabinet : ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం.. పింఛన్ పెంపు సహా కీలక అంశాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ఇవాళ జరగనుంది. ఈ మేరకు ఉదయం 11 గంటలకు సెక్రటేరియేట్'లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది. మిచాంగ్ తుఫాను నష్టంపై ప్రభుత్వ సాయం,పంటనష్టంపై మంత్రి మండలి చర్చించనుంది. తుఫాన్ బాధితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, మౌలిక వసతుల కల్పనపై నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే నెలవారీగా ఇచ్చే సామాజిక పింఛన్ రూ.2,750 నుంచి రూ.3,000లకు పెంచి జనవరి 1 నుంచి అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్'లకూ ఆమోదం తెలుపనుంది. ఎమ్యెల్యే,ఎంపీ అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, మంత్రులకు స్థానచలనం అంశంపై సీఎం జగన్ చర్చించనున్నారు. చంద్రబాబుపై నమోదైన కేసులు,టీడీపీ-జనసేన పొత్తులపైనా దిశనిర్దేశం చేయనున్నారు.