Ap Cabinet : ఏపీలో పెన్షన్ రూ.3వేలకు పెంపు, 45 కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ సర్కార్ (AP Government) పెన్షన్'దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024, జనవరి నుంచి సామాజికపెన్షన్లు (Pensions) రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan mohan Reddy) అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 45 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి రూ.25 లక్షల పెంపుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో జనవరిలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలను అమలు చేయనున్నామని వివరించింది. మిగ్జామ్ తుపాను నష్ట పరిహారం అందించేందుకు ఆమోదం తెలిపింది.