Loading...
AP Cabinet: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

AP Cabinet: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. 55కి పైగా అజెండా అంశాలపై చర్చించిన కేబినెట్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, మేయర్ల ఎన్నిక విధానం, గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్లాంట్లు, డేటా సెంటర్లు, స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో 33.1 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేబినెట్ ఆమోదించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాతినిధ్యం మరింత పెరగనుంది.

వివరాలు 

మేయర్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో

మున్సిపల్ మేయర్ల ఎన్నికకు సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై మేయర్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

కర్నూలులో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు ఓకే

కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

విశాఖలో సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్

విశాఖపట్నంలో అక్షత్ గ్రీన్‌టెక్ సంస్థ ఏర్పాటు చేయనున్న సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అదే సమయంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నాలుగు ప్రాంతాల్లో స్టార్ హోటళ్లకు అనుమతి

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యాటక, ఆతిథ్య రంగాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా స్టార్ హోటళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ADVERTISEMENT