Page Loader
AP cabinet decisions: దసరా నుంచే విశాఖ రాజధానిగా పాలన.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే 
దసరా నుంచే విశాఖ నుంచి పాలన.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే

AP cabinet decisions: దసరా నుంచే విశాఖ రాజధానిగా పాలన.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే 

వ్రాసిన వారు Stalin
Sep 20, 2023
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. విజయదశమి నుంచి విశాఖ నుంచి పాలన సాగించనున్నట్లు మంత్రులతో చెప్పారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన బిల్లులకు ఆమోదం లభించింది. పదవీ విరమణ సమయంలో ఇల్లు లేని ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల పిల్లలకు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద వర్తింపజేయాలని మంత్రివర్గం ఆమోదించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లును కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ

జగనన్న సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ పేరుతో కొత్త పథకం

జగనన్న సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ పేరుతో మరో పథకాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రముఖ యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్‌ ఉండేలా చట్ట సవరణ చేయాలని కేబినె‌ట్‌లో నిర్ణయించారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు వర్సీటీలకు ప్రపంచంలోని టాప్‌-100 విశ్వవిద్యాలయాలతో టై అప్‌ ఉండేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం పొందింది. కురుపాం ఇంజినీరింగ్ కాలేజీల్లో గిరిజనులకు 50 శాతం సీట్లు కేటాయించే ప్రతిపాదన, పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు పీఓటీ చట్టం సవరణ, భూదాన్, గ్రామ్‌దాన్ చట్ట సవరణ బిల్లు, అప్పులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.