Andhra news: ఏపీ కేబినెట్ సమావేశం.. అమరావతిలో కొత్త భవనాల నిర్మాణానికి కేబినెట్ అంగీకారం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 44 అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం, కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన 506 ప్రాజెక్టులపై సుమారు రూ.9,500 కోట్ల పరిపాలన అనుమతులను మంత్రివర్గం ఆమోదించింది. అలాగే, రాజధాని అమరావతిలో లోక్‌భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్‌హౌస్‌లు, సిబ్బంది క్వార్టర్లు నిర్మాణానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్ లో చర్చ
సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారితో కలపడానికి కావలసిన పనుల కోసం సుమారు రూ.532 కోట్ల టెండర్లను పిలవడానికి మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్‌డ్యామ్ నిర్వహణకు సంబంధించిన పరిపాలన అనుమతులను కూడా మంజూరు చేశారు. అంతేకాక, ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్ లో చర్చ జరిగింది. రాష్ట్రంలో SIPB (సెంట్రల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సాహక బోర్డు) ద్వారా తీసుకున్న కీలక నిర్ణయాలన్నీ మంత్రివర్గం ఆమోదించింది.
వివరాలు
రూ.20,444 కోట్ల పెట్టుబడులను మంత్రివర్గం "పచ్చజెండా"
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించిన సుమారు రూ.20,444 కోట్ల పెట్టుబడులను మంత్రివర్గం "పచ్చజెండా" ఊపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 56,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగనుందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.