తదుపరి వార్తా కథనం
AP Cabinet: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 02, 2025
11:56 am
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహిస్తున్నారు.
మంత్రివర్గం ప్రస్తుతం అమరావతిలో రూ.2,723 కోట్లతో చేపట్టే పనులు, రాష్ట్రంలో పెద్ద పరిశ్రమల స్థాపనకు సంబంధించి కీలక నిర్ణయాలను ఆమోదించనుంది.
రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం కోసం కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.
వివరాలు
పవన,సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకారం
అదే విధంగా, నంద్యాల, వైఎస్‌ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలపనుంది.
చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలం పట్ల కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది.
ఈ అంశాలతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోనుంది.