తదుపరి వార్తా కథనం

Andhrpradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 03, 2024
03:25 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
పీఎం ఆవాస్ యోజన కింద గిరిజన గృహాల నిర్మాణానికి మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.
గత ఐదేళ్లుగా నిర్మించని గృహాల రద్దుకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు.
అదనంగా, సమీకృత పర్యాటక విధానం 2024-29, అలాగే 2024-29 క్రీడా విధానంలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
వివరాలు
కేబినెట్ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం.
పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబరు 15)ను ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు అనుమతి.
ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విధానం 4.0కు ఆమోదం.
ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్స్ గార్మెంట్ విధానానికి మంత్రివర్గ ఆమోదం.
ఏపీ మారిటైమ్ విధానానికి కేబినెట్ అనుమతి.
మీరు పూర్తి చేశారు