LOADING...
Kolusu Parthasarathy: గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు,క్వాంటమ్‌ కంప్యూటర్‌,ఆస్పత్రుల అప్‌గ్రేడేషన్‌.. మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం
గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు,క్వాంటమ్‌ కంప్యూటర్‌,ఆస్పత్రుల అప్‌గ్రేడేషన్‌.. మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం

Kolusu Parthasarathy: గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు,క్వాంటమ్‌ కంప్యూటర్‌,ఆస్పత్రుల అప్‌గ్రేడేషన్‌.. మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా దగదర్తి ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండింటినీ పీపీపీ (PPP) విధానంలో అభివృద్ధి చేయడానికి ముయిసాదా ఆర్‌ఎఫ్‌పీ (RFP) ముసాయిదాను కూడా ఆమోదించింది. భూసేకరణ,యుటిలిటీల బదిలీ,ప్రాథమిక మౌలిక వసతుల కల్పన కోసం హడ్కో రుణం వినియోగంపై పెట్టుబడులు-మౌలిక వసతుల శాఖ చేసిన ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.

వివరాలు 

ఉద్యోగ నియామకాలు, సవరణలు 

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల గుండ్లపాడు గ్రామానికి చెందిన దివంగత చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు జూనియర్‌ అసిస్టెంట్‌ హోదాలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారుడు సాకేత్‌ సాయి మైనేని కి క్రీడా కోటా కింద డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం కల్పించేందుకు 1994 చట్టంలోని సెక్షన్‌ 4ను సవరించేందుకు అనుమతి తెలిపింది. అదేవిధంగా అధికార భాషా కమిషన్‌ పేరును 'మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్‌'గా మార్చే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

వివరాలు 

అమరావతిలో ఐబీఎం క్వాంటమ్‌ కంప్యూటర్‌ 

క్వాంటమ్‌ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌లో ఐబీఎం క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఇన్‌స్టాలేషన్‌ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా దేశంలోనే తొలిసారి ఒక రాష్ట్రానికి భౌతిక క్వాంటమ్‌ కంప్యూటర్‌ సదుపాయం లభించనుంది. భూముల కేటాయింపులు, పరిశోధన కేంద్రాలు చిత్తూరు జిల్లా కుప్పం మండలం బైరుగానిపల్లెలో కేంద్రీయ విద్యాలయం స్థాపన కోసం 7.74 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు అప్పగించనున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 12.96 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.5.18 కోట్ల కేంద్ర నిధులతో యోగా-నేచురోపతి కేంద్రీయ పరిశోధన కేంద్రం స్థాపనకు భూములను ఆయుష్‌ శాఖ కమిషనర్‌కు కేటాయించారు.

వివరాలు 

అమరావతి నిర్మాణాలు 

ఏపీసీఆర్‌డీఏ కార్యాలయ భవనంలో నిర్మాణం, ఫినిషింగ్‌, ఐసీటీ, బాహ్య అభివృద్ధి పనుల కోసం రూ.160 కోట్ల టెండర్లు ఇప్పటికే ఖరారైనవాటిని కేబినెట్‌ ర్యాటిఫై చేసింది. ఆస్పత్రుల అప్‌గ్రేడేషన్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులోని 50 పడకల సీహెచ్‌సీని రూ.33.94 కోట్ల వ్యయంతో 100 పడకల ప్రాంతీయ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడానికి ఆమోదం లభించింది. ఇందుకోసం అదనంగా 56 పోస్టులను మంజూరు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని 30 పడకల సీహెచ్‌సీని 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు 18 కొత్త పోస్టులను కల్పించారు.

వివరాలు 

సౌర విద్యుత్ ప్రాజెక్టులు 

మైలవరం మండల వడ్డిరాల, దొడియం గ్రామాల్లోని 1,200 ఎకరాల ప్రభుత్వ భూమిని అదానీ సౌర ఇంధన సంస్థకు 33 ఏళ్ల లీజుపై ఇవ్వాలని నిర్ణయించారు. మార్కెట్‌ విలువలో 10%ను లీజు చార్జీగా చెల్లించాలి, ప్రతి ఐదేళ్లకోసారి 10% పెంపు అమలవుతుంది. సముద్ర విధానం,అంగన్‌వాడీ ఉద్యోగులు సముద్ర సంబంధిత కార్యకలాపాలకు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా ఏపీ సముద్ర విధానంలో సవరణలకు ఆమోదం లభించింది. అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకులు పదవీ విరమణ సమయంలో వరుసగా రూ.1 లక్ష40 వేల గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను కేబినెట్‌ ర్యాటిఫై చేసింది. వేస్ట్ మేనేజ్‌మెంట్‌ పాలసీ 4.0 వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం 4.0 ప్రతిపాదనకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

వివరాలు 

మద్యం ధరల నిర్ణయం

సబ్‌కమిటీ సిఫార్సుల ఆధారంగా మద్యం బ్రాండ్ల ప్రాథమిక ధరలను ఖరారు చేసే ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. టెండర్‌ కమిటీ ద్వారా ధరలు నిర్ణయిస్తారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ధరలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. గ్రామ-వార్డు సచివాలయ సవరణలు డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ నుంచి విద్యా బాధ్యతలను తొలగించి వాటిని వార్డు సంక్షేమం,అభివృద్ధి కార్యదర్శికి అప్పగించనున్నారు. ఈ మార్పులను వార్డు సచివాలయాల్లోనూ అమలు చేయనున్నారు.మొత్తం 1,785 మంది ఉద్యోగులను మళ్లీ కేటాయించారు. దీంతో ఏఎన్‌ఎంలు, వార్డు ఆరోగ్య కార్యదర్శుల పోస్టులు ఖాళీ అవుతున్నాయి.వీటికి బదులుగా 944 కొత్త పోస్టులను సృష్టించారు. దీంతో మొత్తం 2,788 పోస్టులు లభిస్తున్నాయి.ఈ ఖాళీలను డిప్యుటేషన్‌ లేదా ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది.