Page Loader
Nara Lokesh : ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు
Nara Lokesh : ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు

Nara Lokesh : ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 30, 2023
06:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబరు 4న ఉదయం 10గంటలకు సీఐడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని 41ఏ కింద నోటీసులు అందించింది. ఈ నోటీసు కింద అరెస్టు ఉండవు. ప్రస్తుతం లోకేశ్ దిల్లీలోని ఎంపీ జయదేవ్‌ ఆఫీసులో ఉన్న విషయం తెలుసుకున్న సీఐడీ అధికారులు అక్కడివెళ్లి నోటీసులు అందజేశారు. రింగ్‌ రోడ్డు వ్యవహారంపై గతేడాది సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో లోకేశ్‌ను A-14గా గుర్తించింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం లోకేశ్‌ హైకోర్టును ఆశ్రయించగా, శుక్రవారం విచారణ జరిగింది. లోకేశ్‌కు CRPC 41-A ప్రకారం నోటీసులిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ నోటీసులపై అరెస్ట్ లేనందున కోర్టు విచారణ ముగించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లోకేశ్‌కు నోటీసులు  అందజేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు