LOADING...
Chandrababu: 'పాడా' సమావేశంలో ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు అసంతృప్తి
'పాడా' సమావేశంలో ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు అసంతృప్తి

Chandrababu: 'పాడా' సమావేశంలో ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు అసంతృప్తి

వ్రాసిన వారు Moogati Shabari
Apr 22, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన 'పాడా' సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రోటోకాల్‌కు సంబంధించిన వివాదం సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో ఆయన చర్చించారు.

వివరాలు

వారికి వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఈ ఘటనలో పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రవర్తనను సీఎం తప్పుబట్టారు. ప్రోటోకాల్, ఫ్లెక్సీలపై ఫోటోల అంశంపై ఇలా ఘర్షణలకు దిగడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. ఏదైనా లోపం జరిగినట్లయితే, దాన్ని పార్టీ పెద్దలు లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు. బహిరంగంగా వివాదాలకు దిగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, అలాంటి ఘటనలు పార్టీ కార్యకర్తలకు తప్పుదారి చూపే సందేశాలు ఇస్తాయని ఆయన హెచ్చరించారు. ఇకపై ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని పల్లా శ్రీనివాస్‌కు సూచించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మకు తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement