AP Congress: పంచముఖవ్యూహాలు,ఆరు సూత్రాలతో ఎన్నికలకు వెళతాం: ఏపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల కోసం ఏపీ కాంగ్రెస్ పంచముఖ వ్యూహం, 6 సూత్రాలతో బరిలోకి దిగబోతున్నట్లుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి సోమవారం వెల్లడించారు. ఆ పంచముఖ వ్యూహాలు కూడా తులసీ రెడ్డి వివరించారు. వాటిలో 1. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరు,వైఫల్యాలను ఎత్తిచూపడం 2.రాష్ట్రంలో YSRCP ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడం, 3.గత కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలలో సాధించిన ప్రగతిని సమీక్షించడం,4. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో చెప్పడం 5.పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం.
రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజీ
ఆరు సూత్రాల్లో భాగంగా.. 1. 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలుమాఫీ, 2. రూ. 500 లకే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా,3. నిరుపేద కుటుంబాలకు నెలకు రూ.6,000 ఆర్థిక సహాయం,4. ప్రత్యేక హోదా అమలు, 5. ఉక్కు కర్మాగారం, పోలవరం పూర్తి చేయడం, 6.విభజన చట్టంలో పేర్కొన్న అపరిష్కృత సమస్యలన్నింటినీ పరిష్కరించడం,రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజీ అమలు; కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల వంటి హామీ పథకాల అమలు చేయడం అని వివరించారు.