తదుపరి వార్తా కథనం

AP DGP-Transfer-EC: ఏపీ డీజీపీని బదిలీ చేసిన ఈసీ...సీఎస్ కు ఆదేశాలు
వ్రాసిన వారు
Stalin
May 05, 2024
06:50 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)డీజీపీ(DGP)రాజేంద్రనాథ్ రెడ్డి(Rajendranath Reddy)ని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
వెంటనే డీజీపీని బదిలీ చేయాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.
కిందిస్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
సోమవారం ఉదయం 11 గంటలకు ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది.
కొంతకాలంగా విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది.
డీజీజీ రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ కార్యకర్తలా పని చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి.
ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ వైఫల్యాన్ని అడిగితే వారిని, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిని కూడా కేసులతో వేధించారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాతే విపక్ష నేతలు ఆయనను కలవగలిగారు.