LOADING...
Andhra news: బస్సు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
బస్సు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Andhra news: బస్సు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన దారుణ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయి, మరికొంత మంది గాయపడిన విషయం తెలిసిందే. చింతూరు-మారేడుమల్లి ఘాట్‌రోడ్డు ప్రమాద స్థలిని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి (Mandipalli Ramprasad Reddy)పరిశీలించారు. గాయపడిన బాధితులను చింతూరు ఏరియా ఆసుపత్రిలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితులను విచారించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్య సేవలను ఆయన సమీక్షించారు. మంత్రి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్‌తో పాటు అనేకమంది అధికారులు కూడా పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఘటన స్థలిని సందర్శించిన హోమ్ మంత్రి అనిత 

Advertisement