LOADING...
AP Govt : ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆస్తి పన్నుపై 5% రాయితీ
ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆస్తి పన్నుపై 5% రాయితీ

AP Govt : ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆస్తి పన్నుపై 5% రాయితీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 25, 2026
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఆస్తి పన్ను విషయంలో భారీ ఊరటనిస్తూ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను చెల్లించే వారికి కూడా 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మే 1 నుంచి మే 31 మధ్య పన్ను చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. దీనికి సంబంధించిన ప్రకటనను అధికారులు విడుదల చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది పెద్ద ఉపశమనం కానుంది. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే అమలులో ఉన్న ఈ రాయితీని, ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కూడా విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నారు.

వివరాలు

మే 1 నుంచి 31లోపు చెల్లించాలి

ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఆస్తి పన్ను చెల్లింపుదారులు లాభపడనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును మే 1 నుంచి 31లోపు చెల్లిస్తే 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు స్వర్ణ పంచాయత్ పోర్టల్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ సూచించారు. ఇకపోతే ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం రాయితీలు అమలు చేస్తోంది.

వివరాలు

గడువు ముగిసేలోపు చెల్లిస్తేనే రాయితీ

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోపు చెల్లిస్తే 5 శాతం రిబేట్‌ను ప్రకటించింది. ఈ గడువు ముగిసేలోపు చెల్లిస్తే రాయితీ వర్తిస్తుంది. అదే విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ సౌకర్యాన్ని కూడా ఈ నెలాఖరు వరకు పొడిగించారు. గడువులోపు బకాయిలు చెల్లిస్తే వడ్డీలో మాఫీ లభించనుం

Advertisement