Page Loader
Andhrapadesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త స్టేడియం నిర్మాణం.. మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త స్టేడియం నిర్మాణం

Andhrapadesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త స్టేడియం నిర్మాణం.. మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మరో స్టేడియం నిర్మించనున్నారు. ఈ మేరకు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలో దివ్యాంగుల కోసం రూ. 200 కోట్లతో 20 ఎకరాల స్థలంలో స్టేడియం నిర్మించనున్నట్లు ప్రకటించారు. అమరావతిలో మంత్రితో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, 2025లో జరగనున్న రాష్ట్ర పారా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలకు మంత్రి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం తీవ్రంగా కృషి చేస్తోందని, దివ్యాంగులకు పింఛన్లను రూ. 3,000 నుంచి రూ. 6,000కి పెంచినట్లు, అలాగే మంచానికే పరిమితమైన వారికి నెలకు రూ. 15,000 ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

వివరాలు 

భోగాపురంలో క్రికెట్ స్టేడియం

దివ్యాంగ విద్యార్థులకు పింఛన్లను ప్రతినెల వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఇంకా, దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, త్రీ వీలర్స్ అందజేస్తామని చెప్పారు. ఇది కాకుండా, విశాఖపట్నంలో ఇప్పటికే క్రికెట్ స్టేడియం ఉంది. మరో స్టేడియం కూడా నగరంలో ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేస్తూ, భోగాపురంలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి దివ్యాంగుల కోసం ఒక స్టేడియం నిర్మించడానికి నిర్ణయించారు.

వివరాలు 

కొవ్వూరులో చంద్రబాబు పర్యటన 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన సామాజిక పింఛన్ల పంపిణీ చేస్తారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా జరిగే సామూహిక గృహ ప్రవేశాల ప్రారంభ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహకిశోర్‌ దొమ్మేరులో ఏర్పాట్లను పరిశీలించారు.