ఏపీ 12వ పీఆర్సీ ఛైర్మన్ గా మన్మోహన్‌సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
12వ పీఆర్సీ చైర్మన్ ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో పీఆర్‌సీ (పే రివిజన్ కమిషన్) ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్‌సింగ్‌ను నియమించింది.
సంవత్సరంలోగా పీఆర్‌సీ (వేతన సవరణ) సహా వివిధ అంశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించింది. అనంతరం నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో వివరించింది.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, కేటగిరీలకు చెందిన ఉద్యోగులందరి వివరాలను అధ్యయనం చేయాలని కోరింది.
ప్రభుత్వం యంత్రాంగానికి సంబంధించిన అంశాలతో పాటు స్థానిక పరిస్థితులు, కరవు భత్యం (డీఏ)పై సర్వే చేయాలని స్పష్టం చేసింది.
DETAILS
2023 జులై నుంచే ఉద్యోగులకు నూతన పీఆర్సీ అమలు
ఈ మేరకు సిఫార్సులు చేయాలని పీఆర్‌సీ కమిషన్ కు ప్రభుత్వం సూచనలు చేసింది. 2023 జులై నుంచే ఉద్యోగులకు నూతన పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది.
వేతన సవరణ సంఘం ద్వారా ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఖరారు చేసేందుకు కసరత్తులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు సర్కారుకు కొత్త పీఆర్సీ అమలు చేయాలని వినతి పత్రాలు సమర్పించారు.
ఒకవేళ పీఆర్సీ నివేదిక రాక ఆలస్యమైతే ఐఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక వర్గాలు పేర్కొన్నాయి.
ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం 50 శాతం పెన్షన్ తగ్గకుండా కరువు భత్యం (డీఏ) క్రమంగా పెరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.ఈ మేరకు గ్యారెంటెడ్ పెన్షన్ బిల్ 2023కి గతంలోనే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.